టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. లీడ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు అతడు విశ్వరూపం చూపించాడు.
178 బంతుల్లో 147 పరుగులు బాదేశాడు పంత్. ఇందులో 19 ఫోర్లు, ఒక భారీ సిక్స్ ఉన్నాయి.
పంత్ కెరీర్‌లో ఇది 7వ సెంచరీ కాగా.. ఇందులో ఐదు విదేశీ గడ్డ మీదే చేసినవి కావడం విశేషం.
ఈ ఇన్నింగ్స్‌తో ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు పంత్.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన టీమిండియా వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్‌గా (58 సిక్సులు) మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు రిషబ్.
టెస్టుల్లో 3 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు పంత్. తద్వారా గిల్‌క్రిస్ట్ (63 ఇన్నింగ్స్‌లు) తర్వాత అత్యంత వేగంగా ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్న కీపర్‌గా పంత్ (76 ఇన్నింగ్స్‌లు) రికార్డు.