ఆ కుర్రాడే ఫ్యూచర్..  అతడో అద్భుతం: కోహ్లీ

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ కుర్ర ప్లేయర్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడో అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు.

కోహ్లీ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు.. ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్.

ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో రజత్‌ను మెచ్చుకున్నాడు కోహ్లీ.

రజత్ సుదీర్ఘ కాలం బెంగళూరును సారథిగా ముందుండి నడిపిస్తాడని అన్నాడు కోహ్లీ.

రజత్ సూపర్బ్ బ్యాటర్ అని.. అతడిలో సారథ్యానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీ ఫ్యూచర్ పాటిదార్ అని స్పష్టం చేశాడు.

ఫ్రాంచైజీ, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రజత్ నిలబెడతాడని విరాట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.