డేంజర్‌లో బుమ్రా కెరీర్.. ఇక షెడ్డుకేనా..

వెన్ను నొప్పి కారణంగా ఆసీస్ టూర్ నుంచి వచ్చేసిన బుమ్రా ఇంకా రికవర్ కాలేదు.

ఐపీఎల్-2025లో పేసుగుర్రం ఆడతాడో.. లేదో.. చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కంగారూ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా తన శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెడతాడని.. దీని వల్ల తరచూ గాయాల బారిన పడుతున్నాడని చెప్పాడు.

ఎప్పటిలోపు రికవర్ అవుతాడో బుమ్రాకు బాగా తెలుసునని మెక్‌గ్రాత్ తెలిపాడు.

శరీరాన్ని కాపాడుకోకపోతే బుమ్రా కెరీర్‌కు ప్రమాదమేనని.. ఇక షెడ్డుకేనని హెచ్చరించాడు.

ఫిట్‌నెస్ విషయంలో బుమ్రా మరింత జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆసీస్ లెజెండ్ సూచించాడు. 

మైదానంలోనే కాదు.. బయట కూడా జస్‌ప్రీత్ కష్టపడాల్సిందేనని మెక్‌గ్రాత్ సజెషన్ ఇచ్చాడు.