రోహిత్ నుంచి కోహ్లీ వరకు..  స్టార్ల ఫస్ట్ ఐపీఎల్ శాలరీ ఎంతంటే..

ఐపీఎల్-2016తో వెలుగులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఆ సీజన్‌లో రూ.1.90 కోట్ల పారితోషికం అందుకున్నాడు. ఇప్పుడు అతడి ఐపీఎల్ శాలరీ రూ.27 కోట్లు. 

2013 సీజన్‌లో ఆర్సీబీకి ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు కేఎల్ రాహుల్. అతడి ఫస్ట్ ఐపీఎల్ శాలరీ రూ.10 లక్షలు మాత్రమే. ఇప్పుడు రూ.17 కోట్లు అందుకుంటున్నాడు.

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలి ఐపీఎల్ జీతం రూ.2.6 కోట్లు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడటం ద్వారా ఏకంగా రూ.26.75 కోట్లు అందుకోనున్నాడు. 

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫస్ట్ ఐపీఎల్ శాలరీ రూ.3 కోట్లు. రాబోయే సీజన్‌ ఆడితే అతడికి రూ.16.3 కోట్లు దక్కుతాయి.

పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా 12 ఏళ్ల కింద ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు అతడి శాలరీ రూ.10 లక్షలు. ఇప్పుడు అతడి వేతనం రూ.18 కోట్లు.

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫస్ట్ ఐపీఎల్ శాలరీ రూ.12 లక్షలు. తొలి సీజన్ నుంచి ఒకే జట్టు (ఆర్సీబీ)కి ఆడుతూ వస్తున్న కింగ్.. వచ్చే సీజన్‌కు గానూ రూ.21 కోట్లు అందుకోనున్నాడు. 

లెజెండ్ ఎంఎస్ ధోని మొదటి ఐపీఎల్ జీతం రూ.6 కోట్లు. ఈ సీజన్‌ కోసం అతడికి రూ.4 కోట్లు చెల్లించనుంది సీఎస్‌కే. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ కింద మాహీని రీటెయిన్ చేసుకుంది చెన్నై.