2008 నుంచి 2025 వరకు..
ఐపీఎల్‌కు ఒక్కడే కింగ్!
ఐపీఎల్ ఆరంభ సీజన్-2008లోనే లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు విరాట్. ఆ సీజన్‌లో 105 స్ట్రయిక్ రేట్‌తో 165 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీకే ఆడుతూ వస్తున్నాడు.
ఐపీఎల్-2009లో 16 మ్యాచుల్లో 246 పరుగులతో సత్తా చాటాడు కోహ్లీ.
మూడో సీజన్‌లో 16 మ్యాచుల్లో 144 స్ట్రయిక్ రేట్‌తో 307 పరుగులు చేశాడు.
2011లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 16 మ్యాచుల్లో 557 పరుగులతో తనలోని రియల్ టాలెంట్‌ను బయటపెట్టాడు.
ఐపీఎల్-2012లో 364 పరుగులతో మరోమారు సత్తా చాటాడు విరాట్.
ఐపీఎల్-2013 కోహ్లీ కెరీర్‌లో చాలా స్పెషల్. ఆ సీజన్‌లో 16 మ్యాచుల్లో ఏకంగా 634 పరుగులు బాదాడు కింగ్.
మరుసటి ఏడాది 14 మ్యాచుల్లో 359 పరుగులతో ఫర్వాలేదనిపించాడు విరాట్.
ఐపీఎల్-2015లో రెచ్చిపోయిన కోహ్లీ.. 16 మ్యాచుల్లో 130 స్ట్రయిక్ రేట్‌తో 505 పరుగులు బాదాడు.
2016లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్.. 16 మ్యాచుల్లో 152 స్ట్రయిక్ రేట్‌తో ఏకంగా 973 పరుగులు కొట్టి ఔరా అనిపించాడు.
2017లో ఆ రేంజ్‌లో రాణించలేకపోయిన కింగ్.. 308 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఐపీఎల్-2018లో జోరు చూపించిన టాప్ బ్యాటర్.. 530 పరుగులు చేశాడు.
2019 సీజన్‌లో 14 మ్యాచుల్లో 464 పరుగులతో ఆకట్టుకున్నాడు కోహ్లీ.
ఐపీఎల్-2020లో 466 పరుగులు చేశాడు విరాట్.
మరుసటి ఏడాది 405 పరుగులతో ఫర్వాలేదనిపించాడు కోహ్లీ.
ఐపీఎల్-2022లో విరాట్ బ్యాట్ అంతగా గర్జించలేదు. 16 మ్యాచుల్లో 341 పరుగులు మాత్రమే చేశాడు.
ఆ తర్వాతి ఏడాది ఫామ్‌ను అందుకున్న కోహ్లీ.. ఐపీఎల్ -2023లో 14 మ్యాచుల్లో 639 పరుగులతో వహ్వా అనిపించాడు.
గత సీజన్‌లో అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 15 మ్యాచుల్లో 741 పరుగులు బాదాడు.
ఐపీఎల్-2025లో 14 గేమ్స్‌లో 614 పరుగులతో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
Related Web Stories
విజయ్ మాల్యా గాలి తీసిన ఎస్బీఐ.. పరువు పోయింది..!
కుల్దీప్ కాబోయే భార్య ఎవరో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
IPL 2025: ఐపీఎల్ క్యాష్ ప్రైజ్‌లు.. ఎవరికి ఇచ్చారంటే..
ఆర్సీబీ విజయంపై ప్రముఖల భావోద్వేగం..