కుల్దీప్ కాబోయే భార్య ఎవరో తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు వన్షికను పెళ్లాడబోతున్నాడు.
కుల్దీప్-వన్షికల నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. లక్నోలోని ఓ హోటల్‌లో ఈ వేడుకను నిర్వహించారు.
సమీప బంధువులు, స్నేహితుల నడుమ కుల్దీప్-వన్షిక ఉంగరాలు మార్చుకున్నారు.
ఈ ఎంగేజ్‌మెంట్‌కు యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యాడు.
కుల్దీప్ కాబోయే భార్య వన్షికది ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని శ్యామ్‌నగర్. ఆమె ఎల్‌ఐసీలో జాబ్ చేస్తోంది.
చిన్ననాటి స్నేహితులైన కుల్దీప్-వన్షిక ఫ్రెండ్‌షిప్‌ను లవ్ బాండ్‌గా మలుచుకున్నారు. పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు కుల్దీప్. ఈ సిరీస్ ముగిశాకే పెళ్లి చేసుకోనున్నాడీ చైనామన్ బౌలర్.