కోహ్లీ కోసమైనా కప్పు కొడతాం!

మరికొన్ని గంటల్లో ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్-2025 ఫైనల్ ఫైట్ జరగనుంది.

17 ఏళ్లుగా తొలి కప్పు కోసం ఈ రెండు జట్లు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఎవరు గెలిచినా కొత్త చరిత్ర లిఖించినట్లవుతుంది.

గెలుపు కోసం ఇరు జట్లు వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నడంలో బిజీ అయిపోయాయి. ఈ తరుణంలో ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కింగ్ కోహ్లీ కోసమైనా కప్పు నెగ్గి తీరుతామని అన్నాడు పాటిదార్.

ఆర్సీబీకి విరాట్ ఎంతో సేవ చేశాడని అన్నాడు పాటిదార్.

కోహ్లీ అభిమానుల కోసమైనా ఫైనల్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు.

పంజాబ్ కింగ్స్‌తో సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు పాటిదార్.