అయ్యర్ కొత్త చరిత్ర..  ఎవరూ టచ్ చేయలేని రికార్డ్!

ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్.

సారథిగా మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో ఫైనల్‌కు చేరుకుంది.

గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడమే గాక ట్రోఫీ కూడా అందించాడు శ్రేయస్.

ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

ఒకవేళ ఫైనల్‌లో గనుక గెలిస్తే అయ్యర్ ఖాతాలో ఇది రెండో ఐపీఎల్ కప్ అవుతుంది.

ఫైనల్‌లో నెగ్గితే రెండు వేర్వేరు జట్లకు కప్పులు అందించిన తొలి కెప్టెన్‌గా మరో రికార్డును అందుకుంటాడు అయ్యర్.