వీల్‌చైర్ నుంచే సిక్సులు..  డివిలియర్స్ బాదితే ఇట్లుంటది!

సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్‌ పేరు చెబితేనే బౌలర్లు వణుకుతారు.

భీకర షాట్లతో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.

క్రీజులో డ్యాన్స్ చేస్తున్నాడా అన్నట్లు బ్యాటింగ్ చేయడం డివిలియర్స్ స్టైల్.

అలాంటోడు వీల్‌చైర్ టీమ్‌తో కలసి కాసేపు క్రికెట్ ఆడాడు.

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌ కామెంట్రీ కోసం భారత్‌కు విచ్చేసిన ఏబీడీ.. ముంబై-జీటీ మ్యాచ్ తర్వాత వీల్‌చైర్ టీమ్‌తో క్రికెట్ ఆడాడు.

కూర్చొని భారీ సిక్సులు బాదాడు డివిలియర్స్.

కీపర్ తలపై నుంచి సిక్సులు కొట్టిన డివిలియర్స్.. మధ్యలో కుర్చీని తోసుకుంటూ సింగిల్స్, డబుల్స్ కూడా తీశాడు.