అయ్యర్‌కు అన్యాయం..  అంతా గంభీర్ పనే!

జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది టీమిండియా.

ఈ టూర్‌కు వెళ్లే భారత జట్టును ఇటీవలే సెలెక్టర్లు ప్రకటించారు.

ఒక్క శ్రేయస్ అయ్యర్‌కు తప్ప దేశవాళీల్లో అదరగొట్టిన అందరికీ టీమ్‌లో చోటు దక్కింది. ఇదే విషయంపై కోచ్ గంభీర్‌ను ప్రశ్నిస్తే.. తాను సెలెక్టర్‌ను కాదని జవాబిచ్చాడు.

ఈ అంశంపై మాజీ పేసర్ అతుల్ వాసన్ స్పందించాడు.

గంభీర్ ఎంపిక చేయడు.. కానీ రిజెక్ట్ చేస్తాడంటూ మండిపడ్డాడు అతుల్ వాసన్.

టీమ్ సెలెక్షన్ విషయంలో కోచ్‌ది కీలకపాత్ర అని తెలిపాడు.

అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో క్లారిటీ ఇస్తే బాగుండేదన్నాడు అతుల్ వాసన్.