కప్పు ఆర్సీబీదే.. ఈ సెంటిమెంటే సాక్ష్యం!

ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుదేనని ఆ జట్టు అభిమానులు అంటున్నారు.

బ్యాటింగ్ బలంతో పాటు సెంటిమెంట్ కూడా తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు.

ఐపీఎల్‌లో 2011 నుంచి 2024 వరకు పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న జట్టు ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచాయి.

టేటుబ్ టాపర్‌గా ఉన్న టీమ్ 5 సార్లు కప్పును సొంతం చేసుకున్నాయి.

ఈ సెంటిమెంట్ రిపీట్ అవడం ఖాయమని.. కప్పు తమదేనని బెంగళూరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఆర్సీబీని ఆపడం ఎవరి వల్లా కాదని చెబుతున్నారు.

ఈ సాలా కప్ నమ్దే అని స్లోగన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్.