పాపం పంత్..  ఓడిన బాధలో ఉంటే జీతం కట్ చేశారు!

ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో లక్నో విఫలమైంది.

గ్రూప్ దశ నుంచే పంత్ సేన ఇంటిదారి పట్టింది.

ఆర్సీబీతో పోరులోనైనా విజయాన్ని అందుకోవాలని అనుకుంది. కానీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 

ఓటమి బాధలో ఉన్న ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ.

నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఫైన్ వేసింది.

లక్నో ఆటగాళ్లంతా చెరో 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 50 శాతాన్ని చెల్లించాలని ఆదేశించింది.

అసలే ఓడిన బాధలో ఉన్న లక్నోకు ఇది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.