ఆర్సీబీ కొత్త చరిత్ర..  ఐపీఎల్‌లో ఇదే ఫస్ట్ టైమ్!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది.

ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను అందుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకుంది ఆర్సీబీ.

ఇన్‌స్టాలో 20 మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి ఐపీఎల్ జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

ఈ లిస్ట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (18.6 మిలియన్లు) రెండో స్థానంలో ఉంది.

18 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది.

సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫాలోయింగ్‌కు ఇదో మచ్చుతునక అని ఫ్యాన్స్ అంటున్నారు.