చరిత్రకు అడుగు దూరంలో రోహిత్..  వాటే ఫీట్!

పాత రికార్డులకు పాతర వేయడంలో, కొత్త రికార్డులు సృష్టించడంలో హిట్‌మ్యాన్‌కు ఎవరూ సాటి లేరు.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డుల్ని తన పేరు మీద రాసుకున్నాడు రోహిత్.

ఇప్పుడు మరో క్రేజీ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు భారత సారథి.

మరో 3 సిక్సులు బాదితే టీ20ల్లో 550 సిక్సులు బాదిన తొలి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ నిలుస్తాడు.

ఇప్పటివరకు ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు.

గేల్ (1056 సిక్సులు), కీరన్ పొలార్డ్ (908), ఆండ్రీ రస్సెల్ (747) ఈ ఘనత సాధించారు.

క్వాలిఫయర్-2లో రోహిత్ ఈ మైలురాయిని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.