ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడతను.
272 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు కరుణ్.
నాయర్ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్.. అతడే కోహ్లీ వారసుడు అని మెచ్చుకుంటున్నారు.
ఎక్కడ ముగించాడో అక్కడే కరుణ్ మళ్లీ వేట మొదలుపెట్టాడని అంటున్నారు.
2016, డిసెంబర్ 19న ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు కరుణ్ నాయర్.
ట్రిపుల్ సెంచరీ తర్వాత టీమిండియాకు దూరమైన నాయర్.. మళ్లీ అదే ఇంగ్లండ్ టూర్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ టైమ్‌లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ బాదడం చాలా స్పెషల్ అనే చెప్పాలి.