టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నాడు.

తాను తీసుకునే ఆహారంలో దాదాపు 90 శాతం వరకు ఆవిరితో ఉడికించిన ఆహారం మాత్రమే ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు.

మసాలాల ఫుడ్ కు, వేయించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉంటాడు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే దాల్, రాజ్మా, లోబియా, బొబ్బర్లు వంటి పప్పులను మాత్రమే తీసుకుంటాడు.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి సాధారణ నీటికి బదులుగా అధిక pH స్థాయి కలిగిన ఆల్కలీన్ వాటర్ తీసుకుంటాడు.

కోహ్లీ గత కొంతకాలంగా మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అతనికి ఇష్టమైన 'బటర్ చికెన్' వంటి వాటిని దాదాపు పదేళ్లుగా తినడం లేదు.

ఆహార నియమాలతో పాటు రోజూ కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు.