ఆధునిక క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లను కొనసాగించడం అంత సులువైన పని కాదు..

ఈ ఫార్మాట్లలో ఆడాలంటే సుదీర్ఘ కెరీర్, ఫిట్‌నెస్, మారుతున్న పరిస్థితులకు తగ్గ అనుభవం ఉండాలి. ఇవి ఉంటే మూడు ఫార్మాట్లలో ఆడటం సాధ్యమవుతుంది.

ప్రపంచ క్రికెట్‌లో ఆ అరుదైన ఫీట్ సాధించిన వారిలో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ప్రత్యేకంగా నిలిచిపోయారు. తమ దేశాల తరఫున ప్రతి ఫార్మాట్‌లోనూ 100కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.

1. రాస్ టేలర్ (న్యూజిలాండ్) టెస్టులు:112, వన్డేలు: 236, టీ20లు: 102

2. విరాట్ కోహ్లీ (భారత్) టెస్టులు:123, వన్డేలు: 305, టీ20లు: 125

3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) టెస్టులు: 112, వన్డేలు: 161, టీ20లు: 100కిపైగా

4. ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్) టెస్టులు: 100, వన్డేలు: 255, టీ20లు: 102

5. టిమ్ సౌథీ (న్యూజిలాండ్) టెస్టులు: 100+, వన్డేలు: 150+, టీ20లు: 100+