నో మ్యూజిక్.. నో చీర్‌లీడర్స్..  ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో అన్నీ బంద్

సన్‌రైజర్స్-ముంబై మ్యాచ్‌లో డీజే మ్యూజిక్‌తో పాటు టపాసుల మోత, చీర్‌లీడర్స్ గోల ఇలా అన్నింటినీ బంద్ చేశారు.

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగా ఆటగాళ్లంతా చేతికి నల్లరిబ్బన్లు వేసుకొని గ్రౌండ్‌లోకి దిగారు.

మ్యాచ్ ఆరంభానికి ముందు ప్లేయర్లంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.

ఈ మ్యాచ్‌ను ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా నిర్వహించింది బీసీసీఐ.  

పహల్‌గామ్ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

దేశం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై స్టార్ క్రికెటర్లు రియాక్ట్ అవుతున్నారు.

ఈ దాడి బాధితులకు న్యాయం జరగాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు.

దాడికి తెగబడ్డ వారిపై భారత్ తప్పక పగ తీర్చుకుంటుందని టీమిండియా కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు.