ఐసీసీలో గంగూలీ హవా..  ఒక్క పోస్ట్‌తో దాదాగిరి

ఐసీసీ మెన్స్ క్రికెట్‌ చైర్మన్‌గా ఇంకోసారి నియమితుడయ్యాడు లెజెండ్ సౌరవ్ గంగూలీ.

ఐసీసీ తాజా ఏజీఎంలో గంగూలీని మరోసారి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేశారు.

భారత మరో దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ కమిటీలో సభ్యుడిగా కంటిన్యూ కానున్నాడు. 

డెస్మండ్ హేన్స్, హమిద్ హసన్, బవుమా, జొనాథన్ ట్రాట్ వంటి ఇతర మాజీలూ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కుంబ్లే స్థానంలో 2021లో మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు దాదా.

గంగూలీ మరోమారు ఐసీసీలో కీలక పోస్ట్ దక్కించుకోవడంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గంగూలీ ఇలాగే మరిన్ని సేవలు అందించాలని అభిమానులు కోరుతున్నారు.