ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రేర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు.
ఐపీఎల్-2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన సండే ఫైట్‌లో కింగ్ చెలరేగి ఆడాడు.
45 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
టీ20 కెరీర్‌లో కోహ్లీకి ఇది 100వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో 100 హాఫ్ సెంచరీలో బాదిన తొలి ఆసియా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు
ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు క్రీజులోనే పాతుకుపోయాడు.
అతడితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.
ధనాధన్ బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేసిన ఫిల్ సాల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.