ధోని పరువు తీసిన కేకేఆర్.. ఇంత అవమానమా..

ఐపీఎల్-2025లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది సీఎస్‌కే

కేకేఆర్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది చెన్నై

పరాజయానికి తోడు నిన్నటి మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అవమానం జరగడం హాట్ టాపిక్‌గా మారింది

ధోని బ్యాటింగ్‌కు రాగానే సర్కిల్ లోపల టైట్ ఫీల్డింగ్ పెట్టాడు కేకేఆర్ సారథి రహానె

స్లిప్‌లో ఒకర్ని, షార్ట్ లెగ్‌లో మరో ఫీల్డర్‌ను పెట్టి వరుణ్ చక్రవర్తితో వెంటవెంటనే అటాకింగ్ డెలివరీస్ వేయించాడు

2016లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్న గంభీర్ ఇలాగే సర్కిల్ ఫీల్డింగ్‌తో ధోనీని సింగిల్ తీయాలంటే భయపడేలా చేశాడు

ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడే ధోనీకి సర్కిల్ ఫీల్డింగ్ పెట్టడం అంటే అవమానించినట్లేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు