రోహిత్ vs కోహ్లీ:  ఎవరి సంపద ఎంత? 

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిచెస్ట్ క్రికెటర్స్. బీసీసీఐ జీతాలు, ఐపీఎల్ కాంట్రాక్ట్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. 

కోహ్లీకి బీసీసీఐ ద్వారా ఏడాదికి రూ.7 కోట్ల జీతం లభిస్తుంది. అలాగే ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.15 కోట్లు ఆర్జిస్తున్నాడు. 

కోహ్లీ ఎమ్‌ఆర్‌ఎఫ్, ప్యూమా, ఆడి మొదలైన బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీటి ద్వారా ఏడాదికి రూ.196 కోట్లు సంపాదిస్తున్నాడు. 

ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవాకు సహ-అధిపతి. అలాగే పలు నగరాల్లో రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ ఛైన్ సెంటర్స్ ఉన్నాయి. 

కోహ్లీ నెట్‌వర్త్ దాదాపు 1,100 కోట్ల రూపాయలు అని ఓ వార్తా సంస్థ ప్రచురించింది. 

రోహిత్ శర్మకు బీసీసీఐ ద్వారా ఏడాదికి రూ.7 కోట్ల జీతం లభిస్తుంది. అలాగే ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.16 కోట్లు ఆర్జిస్తున్నాడు. 

రోహిత్ శర్మ అడిడాస్, సియట్ టైర్స్, స్విగ్గీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీటి ద్వారా ఏడాదికి రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. 

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సెంటర్స్, రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. రోహిత్ శర్మకు ముంబైలో రూ.30 కోట్లు విలువైన ఫ్లాట్ ఉంది. 

ఓ వార్త సంస్థ లెక్క ప్రకారం రోహిత్ శర్మ నెట్‌వర్త్ రూ.214 కోట్లు. దీనిని బట్టి చూస్తే రోహిత్‌తో పోల్చుకుంటే కోహ్లీ నెట్‌వర్త్ ఐదు రెట్లు ఎక్కువ.