అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు..

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు.

గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.

న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లోనూ కఠిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన అయ్యర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

హాఫ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్ పైకి లేపి సెలబ్రేట్ చేసుకున్నాడు.

 అయితే దాని మీద ఓ రాక్షసుడి పేరు ఉండటంతో డిస్కషన్స్ మొదలయ్యాయి. 

 అయ్యర్ బ్యాట్ మీద ఉన్న ఆ పేరు మరెవరిదో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మదే కావడం విశేషం.

శ్రేయస్ బ్యాట్ హ్యాండిల్‌కు కింద స్పాన్సర్ కంపెనీ పేరు ఉంది. దాని పక్కన ‘హిట్‌మ్యాన్’ అని రాసి ఉంది.

హిట్‌మ్యాన్ కోసం తాను ఎప్పుడైనా, ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పకనే చెప్పాడు స్టైలిష్ బ్యాటర్.