పాక్ గాచారం.. భారత్ మీద ఏడిస్తే ఇలాగే ఉంటుంది

పాక్ జట్టు ఏం చేసినా విమర్శలు తప్పడం లేదు. 

చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ లోపాలతో భారీగా విమర్శలు మూటగట్టుకున్న దాయాది.. ఆటతీరు విషయంలోనూ ట్రోల్ అవుతోంది. 

భారత్, కివీస్ చేతుల్లో ఓడి ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటిముఖం పట్టింది పాక్. 

బంగ్లాతో మ్యాచ్‌లో గెలిచి ఫ్యాన్స్‌కు ఊరట కలిగించాలని పాక్ అనుకుంది. కానీ వాన కారణంగా మ్యాచ్ రద్దయింది. 

మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉన్న రావల్పిండిలో ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తోంది. 

ఎడతెరపి లేని వాన వల్ల మైదానం చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ కూడా జలమయం అవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. 

ఒక్క విజయం లేకుండానే అటు పాక్, ఇటు బంగ్లా.. చాంపియన్స్ ట్రోఫీని పేలవంగా ముగించాయి. 

ఎప్పుడూ భారత్‌పై పడి ఏడిచే పాక్‌కు ఇలాగే అవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.