సారీ చెప్పిన రోహిత్.. చేసిన తప్పు ఒప్పుకొని.. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పు ఒప్పుకున్నాడు. 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓ సులువైన క్యాచ్‌ను మిస్ చేశాడు హిట్‌మ్యాన్. 

అక్షర్ పటేల్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ తీయాలనుకున్నాడు. కానీ రోహిత్ క్యాచ్ వదిలేయడంతో ఆ చాన్స్ పోయింది. 

హ్యాట్రిక్ మిసైన బాధలో ఉన్న అక్షర్‌కు రోహిత్ క్షమాపణలు కోరాడు. 

చేతులు జోడించి తనను క్షమించాలని కోరాడు రోహిత్. 

క్యాచ్ మిస్ చేసినందుకు కోపానికి గురైన రోహిత్ గట్టిగా నేలను బాదాడు. 

రోహిత్ నేలను బాదడం, అక్షర్‌కు సారీ చెప్పడం నెట్టింట వైరల్ అవుతోంది.