దుబాయ్.. ఊపిరి పీల్చుకో  అంటున్న రోహిత్ సేన 

చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు చేరుకుంది భారత జట్టు.

ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ప్లేయర్లు జోరుగా సాధన చేస్తూ కనిపించారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ దగ్గర నుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను గమనించారు. 

బిగ్ షాట్స్ కొట్టడంతో పాటు బంతుల్ని తెలివిగా ఫీల్డర్ల నుంచి దాటించడంపై ట్రిక్స్ చెబుతూ కనిపించాడు రోహిత్.

స్పిన్నర్లతోనూ జోరుగా సాధన చేయించింది టీమ్ మేనేజ్‌మెంట్.

కోహ్లీ, గిల్, హార్దిక్, హర్షిత్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ దర్శనమిచ్చారు.

గంభీర్-రోహిత్ పట్టుదల చూస్తుంటే కప్ లేకుండా దుబాయ్ నుంచి తిరిగొచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ అంటున్నారు.