కీలక మైలురాయికి చేరువలో..!

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ  మరో కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు.

502 అంతర్జాతీయ మ్యాచ్‌లు  ఆడిన రోహిత్ 19,902 పరుగులు చేశాడు.

ఆదివారం రాంచి వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న  వన్డే సిరీస్‌లో 20వేల పరుగుల ఫీట్ అందుకునే ఛాన్స్ ఉంది.

ఈ ఘనత సాధించిన నాలుగో  భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు.

ఇప్పటికే ఈ జాబితాలో  సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.

ఈ ఫీట్ అందుకోవడానికి  హిట్‌మ్యాన్‌కి కావాల్సిన  పరుగులు 98.

67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన  రోహిత్.. 4,31 పరుగులు సాధించాడు.

టీ20ల్లో 4,231, వన్డేల్లో  11,370 పరుగులు చేశాడు.