సచిన్-ద్రవిడ్ రికార్డుపై  రో-కో కన్ను!

నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికా-టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా ఈ సిరీస్‌ని పట్టేయాలని చూస్తోంది.

ఇప్పటికే టెస్టులు, టీ20ల ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి వన్డేలో రో-కో ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టనున్నారు.

రో-కో క్రీజులో నిలబడితే చాలు.. సచిన్ టెండూల్కర్-రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేస్తారు.

సచిన్-ద్రవిడ్ 391 అంతర్జాతీయ మ్యాచుల్లో పలు కీలక భాగస్వామ్యాలు చేశారు.

రాంచీలో రో-కో క్రీజులో నిలబడితే.. 392 మ్యాచుల్లో భాగస్వామ్యం చేసిన వారిగా రికార్డుల్లోకెక్కుతారు.