టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన చాహల్.. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
కీలక సమయాల్లో బ్రేక్‌త్రూలు అందిస్తూ టీమ్ విజయాల్లో ముఖ్యభూమిక పోషించాడు.
చాహల్. పంజాబ్ ట్రోఫీ నెగ్గకపోయినా అతడు తన ఆటతీరుతో అభిమానుల మనసులు దోచుకున్నాడు.
ఈ విషయంపై చాహల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది
అతడు గాయాలతో పోరాటం చేస్తూనే టోర్నీలో ఆడాడని రివీల్ చేసింది. ఇంతకీ మహ్వాష్ ఏం చెప్పిందంటే..
చాహల్ ఆటతీరు, అతడి సంకల్పం, గేమ్ మీద అతడికి ఉన్న దృక్పథం, గాయాలబెడద లాంటివి ఈ పోస్ట్‌లో ప్రస్తావించిందామె.
‘ఆర్సీబీతో ఫైనల్ ఫైట్‌లో పంజాబ్ చివరి వరకు చాలా బలంగా పోరాడింది. చాహల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.
ఈ టోర్నమెంట్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే చాహల్ పక్కటెముకలకు గాయమైంది. అనంతరం అతడి బౌలింగ్ చేసే వేలికి కూడా దెబ్బ తగిలింది. ఇక్కడితో అయిపోలేదు.
ఆ తర్వాత మరో గాయం బారిన పడ్డాడు. ఇలా మూడు గాయాలతో సీజన్ మొత్తం ఆడుతూ వచ్చాడు. ఎక్కడా వెనుకంజ వేయకుండా నొప్పిని పంటి కింద భరిస్తూనే కొనసాగాడు. అతడు నిజమైన పోరాట యోధుడు’ అని మహ్వాష్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.