గంభీర్ మాట వినని ఆర్సీబీ..  ఈ పాపం ఎవరిది?

ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు విషాదంగా ముగిశాయి. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయారు.

వేలాది మంది అభిమానులు ఒకేసారి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

విజయోత్సవ వేడుకలకు సంబంధించి గతంలో గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

11 ఏళ్ల కిందే విక్టరీ సెలబ్రేషన్స్ మీద గౌతీ హెచ్చరించాడు.

విజయోత్సవ వేడుకలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నాడు. తాను ఇలాంటి వాటిల్లో భాగం కాబోనన్నాడు.

గతేడాది కేకేఆర్ కప్ గెలిచినప్పుడు ఇలాగే సంబురాలు నిర్వహించగా.. అందులో కొందరు అభిమానులపై లాఠీచార్జ్‌కు దిగారు పోలీసులు. దీనీపై గౌతీ సీరియస్ అయ్యాడు.

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో అప్పటి గంభీర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.