పెళ్లి పేరుతో మోసం..  చిక్కుల్లో ఆర్సీబీ స్టార్!

ఆర్సీబీ స్టార్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు.

వివాహం చేసుకుంటానని చెప్పి దయాల్ తనను మోసం చేశాడంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపించింది.

యశ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో కంప్లయింట్ చేసిందా యువతి.

5 ఏళ్లుగా యశ్ దయాల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.

కాబోయే కోడలు అంటూ ఇంట్లో పరిచయం చేశాడని తెలిపింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని పేర్కొంది.

దయాల్‌కు ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసిందని కంప్లయింట్‌లో యువతి తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అందుకే న్యాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించానని పేర్కొంది యువతి.

దయాల్‌తో దిగిన ఫొటోలు, వీడియో కాల్స్, చాటింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారంగా చూపానని యువతి తెలిపింది.