బుమ్రాను ఆడించాల్సిందే..  గిల్‌కు మాజీ కోచ్ హెచ్చరిక!

ఇంగ్లండ్ సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమిండియా. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది భారత్.

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో పేసుగుర్రం జస్‌‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగేది, లేనిది అనుమానంగా మారింది.

సిరీస్‌లోని పూర్తి మ్యాచులు ఆడలేనని ఇప్పటికే బుమ్రా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో అతడ్ని ఆడిస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు.

రెండో టెస్ట్‌లో బుమ్రాను ఆడించాలని అంటున్నాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.

జస్‌ప్రీత్‌కు విశ్రాంతి ఇస్తే అది సరైన వ్యూహం కాబోదని కెప్టెన్‌ శుబ్‌మన్ గిల్‌ను హెచ్చరించాడు మాజీ కోచ్.

బుమ్రా ఆడకపోతే రెండో టెస్ట్‌లో మనకు ఓటమి తప్పదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో బుమ్రాను బరిలోకి దింపాలని, జట్టుకు అది అత్యవసరమని రవిశాస్త్రి పేర్కొన్నాడు.