గెలుపు మనదే..
రాహుల్ మాటలు వింటే గూస్‌బంప్సే!
లీడ్స్ టెస్ట్ ఆఖరుకు చేరుకుంది. ఆట ఐదో రోజు ఏదో ఒకటి తేలడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తొలి టెస్ట్‌లో భారత్ గెలవడం పక్కా అని రాహుల్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ఫలితం తేలుతుందని.. అది కూడా భారత్‌కు అనుకూలంగా వస్తుందన్నాడు కేఎల్.
మన జట్టు బౌలర్లు 10 వికెట్లు తీసుకొని విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ చెప్పుకొచ్చాడు.
ఫలానా స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాలని అనుకోవడం లేదని.. ఏ పాత్ర ఇచ్చినా, ఏ ప్లేస్‌లో ఆడమన్నా జట్టును గెలిపించడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేస్తానన్నాడు.
విభిన్న బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని.. ఏ సవాల్‌కైనా తాను సిద్ధమేనన్నాడు రాహుల్.
టీమ్ గెలుపు కోసం ఏం చేయడానికైనా తాను రెడీ అన్నాడు రాహుల్. ఈ సిరీస్‌ను విజయంతో మొదలు పెడతామన్నాడు.
Related Web Stories
బుమ్రా కోహినూర్ కంటే విలువైనోడు: డీకే
కోహ్లీకి కరెక్ట్ రీప్లేస్మెంట్ అతడే: గంగూలీ
పంత్ తెలివికి సచిన్ ఫిదా.. ఇదే కావాలంటూ..!
బ్రాడ్‌మన్ రికార్డు బ్రేక్.. ఇదీ జైస్వాల్ పవర్!