7 రోజులు ఆటకు దూరం..  గట్టిగా బిగించిన ఐసీసీ!

కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనలో మార్పులు చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).

బంతి తగిలి లేదా మరో రకంగా గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ ప్లేయర్‌ను ఆడిస్తున్నారు. అయితే ఇప్పుడీ రూల్‌ను మార్చేశారు.

ఇక మీదట కంకషన్‌కు గురయ్యే ఆటగాడు వారం రోజులు గ్రౌండ్‌కు దూరంగా ఉంటాడు.

ప్రతి మ్యాచ్‌కు టీమ్స్ ఇద్దరు చొప్పున కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ప్రకటించాలని ఐసీసీ స్పష్టం చేసింది.

కంకషన్ రూల్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మార్పులు చేసింది ఐసీసీ.

ఇన్నాళ్లూ టీ20లు, వన్డేల్లో వాడుతున్న స్టాప్ క్లాక్ రూల్‌ను ఇకపై టెస్టుల్లోనూ అమలు చేయనున్నారు.

వైడ్ నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఇకపై బౌలర్ బంతి విసిరేటప్పుడు బ్యాటర్ కాళ్లు ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి వైడా? కాదా? నిర్ణయిస్తారు.