చాహల్‌ కొత్త లవ్‌స్టోరీ..  ఒక్క పోస్ట్‌తో అంతా..

 ఆర్జే మహ్వాష్ అనే అమ్మాయితో చాహల్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వీళ్లిద్దరూ కలసి కనిపించారు.

 ఇన్నాళ్లూ తమ రిలేషన్ గురించి వీళ్లలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.

 ఒక్క పోస్ట్‌తో తమ అనుబంధాన్ని బయటపెట్టింది ఆర్జే మహ్వాష్.

  కేకేఆర్‌తో మ్యాచ్‌లో చాహల్ 4 వికెట్లతో సత్తా చాటడంతో అతడు తోపు అంటూ మెచ్చుకుందామె.

  ఐపీఎల్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఊరికే అయిపోరంటూ చాహల్‌ను ఆకాశానికెత్తేసింది.

 చాహల్‌తో దిగిన ఓ సెల్ఫీని షేర్ చేస్తూ.. ఇది నిజంగా అసంభవం అని క్యాప్షన్ ఇచ్చింది మహ్వాష్.

 ఆర్జే మహ్వాష్ ఒక్క పోస్ట్‌తో అతడ్ని ఎంత లవ్ చేస్తోందో బయటపెట్టిందని, అతడ్ని బాగా చదివేసిందని నెటిజన్స్ అంటున్నారు.