కాళ్లబేరానికి పాకిస్థాన్..  ప్లీజ్ వదిలేయండి అంటూ..!

భారత్‌పై కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్.. ఇప్పుడు మనతో పెట్టుకోవాలంటే భయపడుతోంది.

ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు పాక్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు. దీనికి తోడు సింధూనది జలాలను మోదీ ప్రభుత్వం ఆపేయడంతో శత్రుదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

తాగునీరు, సాగునీరు లేకపోవడంతో తీవ్రంగా అల్లాడుతోంది పాకిస్థాన్. ఏం చేయాలో పాలుపోకపోవడంతో కాళ్లబేరానికి వస్తోంది.

తీవ్ర దుర్భిక్షం నెలకొంది.. దయచేసి నీళ్లు వదలండి అంటూ భారత్‌కు నాలుగు లేఖలు రాసింది పాక్.

ఈ అంశం మీద చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని లేఖల్లో పేర్కొంది పాక్.

ఒక లేఖ మే నెల ఆరంభంలో రాయగా.. మిగతావి ఆపరేషన్ సిందూర్ తర్వాత రాసినట్లు తెలుస్తోంది.

ఈ లేఖల్ని ప్రోటోకాల్‌లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.