లెక్కలు మారుస్తున్న రాహుల్..
ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే!
ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు ముందు కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. మెరుపు శతకంతో అదరగొట్టాడు.
ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
కరుణ్ నాయర్‌తో కలసి 86 పరుగులు, ధృవ్ జురెల్‌తో కలసి 121 పరుగులు జోడించి భారత్-ఏను స్ట్రాంగ్ పొజిషన్‌లో నిలబెట్టాడు.
ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఎలాంటి పొరపాట్లు, తొందరపాటు, అలసత్వానికి తావివ్వలేదు.
ప్రతి బంతిని ఎంతో కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు రాహుల్. అతడి బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
రోహిత్-కోహ్లీ లేరు కాబట్టి ఇకపై టీమిండియా బ్యాటింగ్‌కు రాహులే మూలస్తంభమని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
రాహుల్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలేనని కామెంట్స్ చేస్తున్నారు.
Related Web Stories
చాహల్ పట్టుదలకు గర్ల్ ఫ్రెండ్ ఫిదా!
గంభీర్ మాట వినని ఆర్సీబీ.. ఈ పాపం ఎవరిది?
2008 నుంచి 2025 వరకు.. ఐపీఎల్లో ఎదురులేని కింగ్!
విజయ్ మాల్యా గాలి తీసిన ఎస్బీఐ.. పరువు పోయింది..!