టీమిండియాకు ఘోర అవమానం.. ఇంత దారుణమా

ఐసీసీ ర్యాంకింగ్స్, అవార్డ్స్, ప్లేయింగ్ ఎలెవన్‌లో హవా చూపించే భారత్‌కు భారీ అవమానం ఎదురైంది. 

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. 

వన్డే ఫైనల్ 11లో ఏకంగా 10 మంది ఉపఖండ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. 

శ్రీలంక నుంచి నలుగురు, పాకిస్థాన్ నుంచి ముగ్గురు, ఆఫ్ఘానిస్థాన్ నుంచి ముగ్గురు, వెస్టిండీస్ నుంచి ఒక ప్లేయర్‌కు చోటు దక్కింది. 

వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు పాకిస్థాన్ ఆటగాడు సయీమ్ అయూబ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

2024లో కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది భారత్. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో ఓడిపోయింది. 

లంక సిరీస్ ఓటమి, తక్కువ మ్యాచులు ఆడటం వల్లే వన్డే ఫైనల్ 11కు భారత్ నుంచి ఎవరూ ఎంపిక కాకపోవడానికి కారణమని తెలుస్తోంది.