క్రికెట్ లో భారత మహిళా జట్టు వన్డేల్లో  అత్యధిక స్కోర్ నమోదు చేసింది

ఐర్లాండ్ పై 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోరు చేసింది

48 ఏళ్ల చరిత్రలో 370 పరుగుల మార్క్‌ను అందుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం

జెమీమా రోడ్రిగ్స్ 91 బంతుల్లోనే 102 పరుగులు చేసింది

జెమీమా బ్యాట్ నుంచి 12 బౌండరీలు వచ్చాయి

హర్లీన్ డియోల్ (89) తో కలసి మూడో వికెట్‌కు ఏకంగా 183 పరుగులు జోడించింది

2017 లో ఇదే జట్టు పై చేసిన 358 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును బద్దలు కొట్టారు

తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు మాత్రమే చేయగలిగింది

ఓపెనర్లు స్మృతి మంథాన (73), ప్రతీకా రావల్ (67) తొలి వికెట్‌కు ఏకంగా 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు