ఎడ్డం అంటే తెడ్డం.. రోహిత్ సేనకు కప్పు కష్టమే

వచ్చే నెలలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇందులో పాల్గొనే భారత జట్టును శనివారం ప్రకటించారు. 

చాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా స్క్వాడ్ బలంగానే ఉంది. 

ఈ స్క్వాడ్ సెలెక్షన్ టైమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ మధ్య ఫైట్ జరిగిందని తెలుస్తోంది. 

గిల్‌ను వైస్ కెప్టెన్ చేయాలని రోహిత్, హార్దిక్‌కు ఆ పోస్ట్ ఇవ్వాలని గౌతీ గొడవ పడ్డారట. 

కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్, పంత్‌ను సెలెక్ట్ చేయాలని హిట్‌మ్యాన్ వాదులాటకు దిగారట. 

గిల్‌కు వైస్ కెప్టెన్సీ దక్కడం, పంత్‌ను కీపర్‌గా తీసుకోవడంతో రోహిత్ మాట నెగ్గిందని.. గౌతీ ఓడిపోయాడని రూమర్స్ వస్తున్నాయి. 

ఇద్దరి కోసం రోహిత్-గౌతీ ఫైట్‌కు దిగడం, ఈగోలకు వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈగోల వల్ల టీమ్‌కు ఒరిగేదేమీ లేదని.. కోచ్-కెప్టెన్ మధ్య సఖ్యత దెబ్బతింటే కప్పు కష్టమేననే కామెంట్స్ వస్తున్నాయి.