తెలుగు తేజం నితీష్ రెడ్డి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
చెపాక్ వేదికగా జరిగిన రెండో టీ20కి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో నితీష్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు
నితీష్ స్థానంలో పించ్ హిట్టర్ శివమ్ దూబేను రీప్లేస్ చేసింది బీసీసీఐ.
ఆసీస్ టూర్‌లో అన్ని మ్యాచులు ఆడిన నితీష్.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తూ అలసిపోయాడు. అయినా తక్కువ గ్యాప్‌లో పెద్దగా రెస్ట్ లేకుండా ఇంగ్లండ్ సిరీస్‌కు సిద్ధమయ్యాడు.
యంగ్‌స్టర్స్‌కు సరైన విశ్రాంతి ఇవ్వకుండా వరుస సిరీస్‌లు ఆడిస్తే గాయాలు తప్పవని, ఇది గంభీర్ తప్పేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆటగాళ్ల వయసు, అనుభవం, శరీరతత్వాన్ని బట్టి ఎన్ని మ్యాచులు ఆడించాలో గంభీర్ డిసైడ్ అవ్వాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.