ఆ సూపర్ పవర్ కావాలి..  సచిన్‌కు నీరజ్ రిక్వెస్ట్!

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌లోని సూపర్ పవర్ తనకూ కావాలని స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు.

ఎంతో మంది వరల్డ్ క్లాస్ బౌలర్ల చాలెంజ్‌ను సచిన్ సమర్థంగా ఎదుర్కొన్నాడని.. ఆయన గ్రేట్ అంటూ మెచ్చుకున్నాడు నీరజ్.

కెరీర్ ఆసాంతం సచిన్ అసాధారణ ప్రదర్శన చేశాడని.. ఆ సూపర్ పవర్ తనకూ కావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

సూపర్ పవర్ వస్తే తానూ సచిన్‌లాగే రాణించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు నీరజ్.

ప్రత్యర్థులు విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి సూపర్ పవర్‌ను వాడతానని అన్నాడు స్టార్ జావెలిన్ త్రోయర్.

పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా జావెలిన్ విసిరితే చూడాలని ఉందన్నాడు నీరజ్.

బుమ్రా నుంచి బౌలింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు.