ఇవారా.. కేఎల్ రాహుల్ కూతురి పేరుకు అర్థం తెలుసా..

భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టి దంపతులకు మార్చి 24న పండంటి ఆడబిడ్డ పుట్టింది.

ఏప్రిల్ 18న తన పుట్టిన రోజు సందర్భంగా వారసురాలి పేరును రివీల్ చేశాడు కేఎల్

కూతురికి ఇవారా అంటూ తాజాగా నామకరణం చేశారు రాహుల్-అతియా

ఇవారా.. ఈ పేరుకు అర్థం ఏంటి అంటూ తెలుసుకునే పనిలో పడ్డారు కేఎల్ ఫ్యాన్స్

ఇవారా అనేది సంస్కృత పదం. దీనికి దేవుడి బహుమతి అని అర్థం

ఈ పాప గాడ్ గిఫ్ట్ అని, రాహుల్‌కు తను లక్కీ మస్కట్ అని ఫ్యాన్స్ అంటున్నారు

కూతురు పుట్టాక క్రికెట్‌లో రాహుల్ అదరగొడుతున్నాడని అభిమానులు చెబుతున్నారు