బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు.. ఫస్ట్ బౌలర్‌గా రికార్డు

పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు బుమ్రా. 

టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. 

ఐసీసీ పురస్కారాల్లో భారత్‌కు మరో అవార్డు దక్కింది. 

మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైంది. 

అటు బుమ్రా, ఇటు స్మృతి అవార్డులు గెలవడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. 

బుమ్రా, స్మృతి ఇలాగే ఆడుతూ దేశ ప్రతిష్టను మరింత పెంచాలని అభిమానులు కోరుతున్నారు.