ఫైనల్స్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. ఎంత పని చేశావ్ జడేజా..

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాను చిక్కుల్లో పడేశాడు జడేజా.

జడ్డూ సరదాగా చేసిన ఒక పని భారత్‌కు తీవ్ర ముప్పు తెచ్చేలా ఉంది.

నిన్నటి సెమీస్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసేందుకు వచ్చాడీ స్టార్ స్పిన్నర్.

స్మిత్ కొట్టిన బంతికి లబుషేన్ రన్‌కు ప్రయత్నించగా సరదాగా అడ్డుకున్నాడు జడేజా. పరిగెత్తకుండా అతడ్ని నిరోధించాడు.

లబుషేన్ లైట్ తీసుకున్నా.. అలా ఎలా ఆపుతావంటూ జడ్డూపై స్మిత్ సీరియస్ అయ్యాడు. 

ఐసీసీ రూల్స్ ప్రకారం.. బ్యాటర్‌ను బౌలర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. తప్పు రుజువైతే జరిమానా లేదా మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. 

ఒకవేళ జడేజాపై ఆసీస్ ఫిర్యాదు చేస్తే ఫైనల్‌ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.