ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ దిగ్గజాల విగ్రహాలు చాలా చోట్లనే ఉన్నాయి.

తాజాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో 70 అడుగుల భారీ మెస్సి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇంకా ఇతర ఫుట్‌బాల్ దిగ్గజాల విగ్రహాలు ఎక్కడెక్కడ.. ఎవరెవరివి ఉన్నాయంటే..?

మెస్సి- కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో 70 అడుగుల భారీ విగ్రహం.

క్రిస్టియానో రోనాల్డో- గోవా రాజధాని పనాజీలో 410 కిలోల కాంస్య విగ్రహం.

లియోనెల్ మెస్సి- అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 2016లో కాంస్య విగ్రహం ఏర్పాటు.

పీలే- బ్రెజిలియన్ ఫుట్‌బాల్ మ్యూజియం ముందు దిగ్గజ ఆటగాడు పీలే విగ్రహం ఉంది.