నల్లకలువదే ఎర్రకోట.. వాటే విక్టరీ!
మట్టి కోటకు కొత్త రాణి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్-2025ను కైవసం చేసుకుంది అమెరికా అమ్మాయి కొకో గాఫ్.
వరల్డ్ నంబర్ వన్ అరియానా సబలెంకా పవర్ గేమ్‌కు చెక్ పెట్టింది.
ఫైనల్ పోరులో 6-7 (5-7), 6-2, 6-4తో సబలెంకాను మట్టికరిపించింది కొకో గాఫ్.
సెరెనా విలియమ్స్ (2015) తర్వాత ఫ్రెంచ్ టైటిల్ నెగ్గిన తొలి యూఎస్ మహిళగా కొకో నిలిచింది.
కొకో గాఫ్‌కు కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం.
2023లో యూఎస్ ఓపెన్‌ను గెలిచిన కొకో గాఫ్.. అప్పుడు కూడా ఫైనల్ ఫైట్‌లో సబలెంకా మీదే విక్టరీ కొట్టింది.
2022 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకుంది కొకో గాఫ్. అప్పట్లో రన్నరప్‌గా నిలిచినా.. ఈసారి విజయం సాధించి అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.
Related Web Stories
కాళ్లబేరానికి పాకిస్థాన్.. ప్లీజ్ వదిలేయండి అంటూ..!
లెక్కలు మారుస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే!
చాహల్ పట్టుదలకు గర్ల్ ఫ్రెండ్ ఫిదా!
గంభీర్ మాట వినని ఆర్సీబీ.. ఈ పాపం ఎవరిది?