నాణేనికి రెండు వైపులు అన్నట్లు.. ఈ ఏడాది ఎన్నో చారిత్రక విజయాలు ఓ వైపు అయితే.. ఎంతో మంది క్రీడా దిగ్గజాలు తమ ఆటకు వీడ్కోలు పలకడం ఇంకో వైపు.
వివిధ రంగాల్లో తమ ప్రతిభతో దేశానికి ఎంతో సేవ చేసి.. ఈ యేడు తమ ఆటకు ముగింపు పలికిన ఆ దిగ్గజాలు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు విరాట్ సొంతం. అనూహ్యంగా టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ
టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ కూడా టెస్ట్, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై పలికాడు.
జాన్ సెనా
అమెరికా WWE రెజ్లర్ జాన్ సెనా డిసెంబర్ 13, 2025న రిటైర్మెంట్ ప్రకటించాడు.
రాఫెల్ నాదల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్.. కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఆటకు తన శరీరం సహకరించడం లేదని వీడ్కోలు పలికాడు.
వందనా కటారియా
భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియా.. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ఆమె కెరీర్‌కే హైలైట్.
రోహన్ బోపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న.. 2024లో పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించి ఈ ఘనతను అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు.
గ్లేన్ మాక్స్‌వెల్
ఆస్ట్రేలియా డేంజరేస్ బ్యాటర్ మ్యాక్సీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
హెన్రిచ్ క్లాసెన్
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ క్లాసెన్ 34 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.