హార్దిక్ ప్రేయసి.. ఎవరీ మహికా?

ఇటీవల టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్  హార్దిక్ పాండ్య ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి డగౌట్‌లో ఉన్న తన ప్రేయసికి బ్యాట్‌తోనే ముద్దులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పాండ్య, మోడల్ మహికా శర్మ డేటింగ్‌లో ఉన్నారు.  అసలు ఎవరీమె?

2001లో పుట్టిక మహికా.. ‘ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్-2024’లో మోడల్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును అందుకుంది.

స్కూలింగ్ అంతా ఢిల్లీలో సాగగా.. పై చదువులకు యూఎస్‌కి వెళ్లింది. ఎకనామిక్స్& ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.

స్కూల్లో ఉన్నప్పుడు బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడేది. డిబేట్‌లు, ఉపన్యాసాలివ్వడంలో దిట్ట.

కాలేజ్ చదువు అయ్యాక యోగా ట్రైనర్ అవ్వడానికి శిక్షణ తీసుకుంది. అలా ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

మహికా మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది. మోడలింగ్‌తో పాటు ఇవీ ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టాయి.

ఉమంగ్ ఫౌండేషన్‌లో 2018 నుంచి వాలంటీర్‌గా పని చేస్తుంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు పిల్లలకు పాఠాలు చెబుతుంది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు మనీశ్ మల్హోత్ర, తరుణ్ తహ్లీయాని, అనితా డోంగ్రే రూపొందించిన దుస్తుల్లో మహికా తరచూ ర్యాంప్ వాక్ చేస్తుంది.