తొలి పండుగ అంటే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి.
తొలిఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.
మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు సేవిస్తారు.
సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి.
వాటిలో ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అని పిలుస్తారు.
శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీ హరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. ఆ కన్య రాక్షసుణ్ని అంతం చేసిందట.
సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా ఆ కన్య తాను విష్ణుప్రియగా లోకంలో అందరిచేత పూజింపబడాలని కోరుకుందట.
అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది..
Related Web Stories
దేవాలయం నుంచి రాగానే ఈ పనులు అస్సలు చేయొద్దు
వాస్తు దోషం.. ఇంట్లో వినాయక విగ్రహం ఇలా పెట్టండి..
శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది
ఈ 4 రాశుల వాళ్లు కాలికి నల్లదారం కట్టుకోకూడదట! ఎందుకో తెలుసా?